అపోలో హాస్పిటల్లో చేరిన స్టార్ హీరో అజిత్.. ఆందోళనలో అభిమానులు?

March 8, 2024

అపోలో హాస్పిటల్లో చేరిన స్టార్ హీరో అజిత్.. ఆందోళనలో అభిమానులు?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అజిత్ ఒకరు. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి అజిత్ ఇటీవల కాస్త సినిమాలను తగ్గించారు. అయితే ప్రస్తుతం ఈయన ఓ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా తాజాగా నటుడు అజిత్ అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇలా ఈయన అపోలో హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో అసలు ఏం జరిగింది ఎందుకు ఈయన అడ్మిట్ అయ్యారు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అజిత్ హాస్పిటల్ పాలయ్యారంటూ అభిమానులు కంగారుపడుతున్నటువంటి తరుణంలో ఆయనకు సంబంధించినటువంటి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అజిత్ హాస్పిటల్ వెళ్లడానికి మరేంటి కారణాలు లేవని తెలుస్తోంది ఆయన ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదని క్షేమంగా ఉన్నారని సమాచారం అయితే జనరల్ చెకప్ కోసమే ఈయన అపోలో హాస్పిటల్ వెళ్లారని తెలుస్తోంది. ఇలా జనరల్ చెకప్ కోసం వెళ్ళినటువంటి అజిత్ ఒకటి రెండు రోజులపాటు హాస్పిటల్ లోనే ఉంటూ అన్ని రకాల పరీక్షలను చేయించుకొని అనంతరం ఇంటికి తిరిగి రాబోతున్నారని తెలుస్తోంది.

ఇలా ఈయన జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళగా సోషల్ మీడియాలో ఈయన అనారోగ్యం గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి కానీ అందులో ఏమాత్రం నిజం లేదని అభిమానులు ఎవరు కూడా కంగారు పడద్దనే వార్త వైరల్ అవుతుంది. అయితే ఈయన క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కానీ ఈ విషయం గురించి తమ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని మరికొందరు భావిస్తున్నారు.

Read More: మహా శివరాత్రి సందర్భంగా విష్ణు మంచు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్

Related News

ట్రెండింగ్ వార్తలు