ఎన్టీఆర్ తో మరోసారి నటించాలని ఉంది.. మనసులో కోరిక బయటపెట్టిన ప్రియమణి?

February 29, 2024

ఎన్టీఆర్ తో మరోసారి నటించాలని ఉంది.. మనసులో కోరిక బయటపెట్టిన ప్రియమణి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక సమయంలో అగ్ర హీరోలు అందరు సరసన నటించి మెప్పించిన వారిలో నటి ప్రియమణి ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాల పాటు హీరోయిన్ గా కొనసాగారు. తమిళ తెలుగు భాష చిత్రాలలో అగ్ర హీరోలందరి సరసన నటించారు. ఈ విధంగా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి ప్రియమణి కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా ప్రియమణి నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. తాజాగా ఈమె భామ కలాపం 2 అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇది నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రియమణి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన మనసులో కోరికను కూడా ఈమె బయట పెట్టింది తనకు మరోసారి ఎన్టీఆర్ తో కలిసి తన సినిమాలలో నటించాలని ఉంది అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ తో కలిసి తాను యమదొంగ సినిమాలో నటించానని ప్రియమణి తెలియజేశారు. ఈ సినిమాలో తాను ఎన్టీఆర్ తో కలిసి నటించడం తనకు ఒక గొప్ప అనుభూతిని కలిగించిందని ఈ సినిమా తన కెరియర్ లోనే ఎంతో గొప్పగా నిలిచిపోయిందని తెలియజేశారు. అందుకే మరోసారి ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలని ఉందని, ఆ అవకాశం వస్తే అసలు వదులుకోనని అవకాశం కోసమే తాను ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ప్రియమణి ఎన్టీఆర్ తో సినిమా చేయడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: బన్నీతో ఒక్కసారైనా అలా చేయాలని ఉంది.. స్టార్ డాటర్ కోరికలు మామూలుగా లేవు?

ట్రెండింగ్ వార్తలు