దేవకన్యలా సీతారామం బ్యూటీ..ఫొటోస్ వైరల్!

December 30, 2023

దేవకన్యలా సీతారామం బ్యూటీ..ఫొటోస్ వైరల్!

ఉత్తరాది బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎన్నో ఆడ్ చేస్తూ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం అయినటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఒకరు. ఇలా బుల్లితెర హిందీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె మెల్లిమెల్లగా బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమె అనంతరం తెలుగు సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో మలియాళీ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించినటువంటి సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా మొదటి సినిమాతోనే సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత తనకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఈమె కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే కమిట్ అవుతూ వచ్చారు. ఇటీవల హాయ్ నాన్న సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

మృణాల్(Mrunal Thakur) ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా తెలుగు సినిమాలో మాత్రమే కాకుండా బాలీవుడ్ బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలతో పాటు తరచూ తన గ్లామరస్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా మృణాల్ ఈమె గాగ్రా చోళీలో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఈమె దేవకన్య ఎలా మెరిసిపోతూ కనిపించారు ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ బ్యూటిఫుల్ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మృణాల్ బ్యూటిఫుల్ క్యూట్ ఫోటోల పై లుక్ వేసేయండి.

Read More: ఆ సత్యను వదిలేసి ఈ సత్యను పట్టుకున్నాడా?.. అదరగొట్టేసిన చమ్మక్ చంద్ర

ట్రెండింగ్ వార్తలు