మరీ ఇంత పొట్టి బట్టలా?.. రష్మిక ఫోటోపై ట్రోలింగ్

December 30, 2023

మరీ ఇంత పొట్టి బట్టలా?.. రష్మిక ఫోటోపై ట్రోలింగ్

కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒకరు. ఈమె కిరిక్ పార్టీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఎంతో మంచి క్రేజ్ వచ్చింది అనంతరం తెలుగులో కూడా అవకాశాలు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఫోకస్ చేసింది. ఇక తెలుగులో ఈమె నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి.

ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా పరిచయమైనటువంటి రష్మిక ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నటువంటి రష్మిక ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు అలాగే టాలీవుడ్ సినిమాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక(Rashmika Mandanna) సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఈమె సందడి చేశారు.

ఇలా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఈమె గ్లామరస్ ఫోటోలకు ఫోజులిచ్చారు. టాప్ టు బాటమ్ ఫోటోలలో కనపడేలాగా ఈమె ఫోజులు ఇచ్చారు. అయితే ఈ ఫోటోలలో రష్మిక పొట్టి నిక్కర్ ధరించి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేయడంతో ఈ ఫోటో పై భారీ స్థాయిలో కామెంట్లు వస్తున్నాయి. కొంతమంది నేటిజన్స్ ఈ ఫోటో చూసి రష్మికను ఇంత పొట్టి డ్రెస్సులో ఎప్పుడూ కూడా చూడలేదు మరి ఇంత చిన్న డ్రెస్ వేసుకోవడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Read More: కావ్యా థాపర్‌ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. కనీసం పేరు కూడా గుర్తు లేదా?

ట్రెండింగ్ వార్తలు