గోవాలో బిగ్ బాస్ సావిత్రి ఎంజాయ్!.. బీఆర్ఎస్ ఇచ్చిన డబ్బులు ఇంకా అయిపోలేదా?

January 1, 2024

గోవాలో బిగ్ బాస్ సావిత్రి ఎంజాయ్!.. బీఆర్ఎస్ ఇచ్చిన డబ్బులు ఇంకా అయిపోలేదా?

తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సావిత్రి ఒకరు. తీన్మార్ సావిత్రిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అసలు పేరు శివ జ్యోతి(Shiva Jyothi). అయితే ఈ వార్తల ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి శివ జ్యోతి ఈ కార్యక్రమం అనంతరం బుల్లితెర కార్యక్రమాలతో పాటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేసే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఇటీవల తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తరపున ఈమె పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. మరోసారి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలి అంటూ ఎన్నికల రోజు వరకు సోషల్ మీడియా వేదికగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

తెలంగాణ ఎన్నికలలో బారాస పార్టీ ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈమెపై భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఇలా ప్రమోషన్స్ చేయడానికి ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నావు జ్యోతక్క అంటూ కొందరు కామెంట్లు చేయగా మరో బీఎండబ్ల్యూ కారు నీ ఇంటి ముందు ఉంటుంది పో అంటూ మరికొందరు ఈ ప్రమోషన్ల పై భారీగానే ఈమెనూ ట్రోల్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె తన భర్తతో కలిసి వెకేషన్ లో ఉన్నారని తెలుస్తోంది.

చాలా రోజుల తర్వాత శివజ్యోతి(Shiva Jyothi) తన భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్లడమే కాకుండా వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా గోవా బీచ్ లో ఈమె ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమె పట్ల భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేస్తూ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వెకేషన్ లో ఉండడంతో ఏంటి జ్యోతక్క బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇంకా అయిపోలేదా.. ఇలా వెకేషన్ లోనే ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నావు అంటూ భారీగా ఈమెపై ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: మందు తాగుతున్న విష్ణుప్రియ, రీతూ చౌదరి.. వీడియో వైరల్?

Related News

ట్రెండింగ్ వార్తలు