April 1, 2024
కలర్‌ఫోటో సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సుహాస్..ఆ తర్వాత వచ్చిన రైటర్ పద్మభూషన్ తో మినిమం గ్యారెంటీ హీరో అనే ముద్ర వేసుకున్నాడు..ఇటీవల వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాకూడా డీసెంట్ గానే కలెక్ట్ చేసింది. దాంతో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసి అరడజనుకుపైగా సినిమాల్ని లైన్‌లో పెట్టాడు సుహాస్.. ఈనెల 12న సుహాస్ నటించిన శ్రీరంగనీతులు సినిమా రిలీజ్ కానుంది..అలాగే మర్డర్ మిస్టరీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రసన్నవదనం సినిమా కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. దీంతో మరో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు సుహాస్.
ఈ సారి పూర్తి ప్రేమ కథా చిత్రానికి ఓకే చెప్పాడు సుహాస్. ఈ చిత్రానికి ఓ భామ అయ్యో రామ అనే ఆసక్తికరమైన అచ్చ తెలుగు టైటిల్ ఫైనల్ చేశారు. మాళవిక మనోజ్ హీరోయిన్. మారుతి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన రామ్ గోదాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు సుహాస్ మాట్లాడుతూ రామ్ గోదాల నాకు మారుతి గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నప్పటి నుంచి తెలుసు. నా అభిమాన నటులతో నటించే అవకాశం నాకు ఈ సినిమాతో దొరికింది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్‌కు వెళదామా అని ఎదురుచూస్తున్నాను అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నువ్వునేను ఫేం అనితా హస్సానందని మాట్లాడుతూ నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఫర్ ఫెక్ట్‌గా కుదిరిన చిత్రమిది.
నన్ను ఎంతగానో ఆకర్షించిన కథ ఇది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ, సుహాస్ కొత్తగా దర్శకత్వం చేసే వాళ్లకు దొరికిన వరం. ఎంతో కంఫర్టబుల్ ఆర్టిస్ట్. చాలా వైవిధ్యమైన కథలతో, సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి సుహాస్ సినిమా చేయడం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మంచి టెక్నిషియన్స్‌ను ఇచ్చాడు. రథన్ సంగీతం చిత్రానికి అదనపు బలంగా వుంటుంది అన్నారు.
Read More: అదిరిపోయిన తమ్ముడు ఫస్ట్ లుక్ పోస్టర్!