April 2, 2024
టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన అభిషేక్ పిక్చర్స్ ఎల్లప్పుడూ ఎక్సయిటింగ్ కాన్సెప్ట్‌లతో ముందుకొస్తుంది. ప్రొడక్షన్ బ్యానర్ వారి ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేసింది. సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ అఘోరాలు ఫెరోషియస్ గా నడుస్తున్నట్లు చూపిస్తుంది. పుర్రెలు, అగ్ని, మంచు పర్వతాలు, యూనివర్స్ ను అద్భుతంగా చూపిస్తున్న ఈ పోస్టర్ మంత్రముగ్ధులను చేస్తుంది.
ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలున్నాయని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. పోస్టర్‌పై స్మరామి నారాయణన్ తత్వమవ్యయం అని రాయడం చాలా ఆసక్తికరంగా వుంది.
లార్జర్ దెన్ లైఫ్ కథతో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 9న ఉగాది సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
Read More: ప్రపంచం తెలియని నాకు ప్రపంచాన్ని పరిచయం చేశారు.. కుమారి ఆంటీ ఎమోషనల్ కామెంట్స్?