యాక్టింగ్‌కు నాజర్‌ గుడ్‌ బై?…నాజర్‌ భార్య ఏమన్నారంటే..!

July 2, 2022

యాక్టింగ్‌కు నాజర్‌ గుడ్‌ బై?…నాజర్‌ భార్య ఏమన్నారంటే..!
Actor Nassar to Quit Acting All You Need to Know: ప్రముఖ సీనియర్‌ నటులు నాజర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆయన ఎందరో అభిమానులకు సంపాదించుకున్నారు. అయితే కొన్ని రోజులుగా నాజర్‌ ఆరోగ్యం బాగోలేదని,ఆయన నటనకు గుడ్‌ బై చెప్పనున్నారన్న వార్తలు సోషల్‌మీడియాలో, నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై నాజర్‌ భార్య కమీలా నాజర్‌ స్పందించారు.

‘‘నాజర్‌గారి ఆరోగ్యం గురించి, ఆయన యాక్టింగ్‌ రిటైర్మెంట్‌ గురించి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి అసత్య వార్తలు రాస్తున్నవారు..ఇలాంటి వార్తా కథనాలేమరికొందరిపై కూడా రాసుకుంటూ ఈ వార్తలు రాస్తున్న వారు మరింత కాలం జీవించాలని కోరు కుంటున్నాను. నాజర్‌ పీల్చేది, తినేది సినిమానే. నాజర్‌ యాక్టింగ్‌లో రిటైర్‌ అవ్వడం లేదు. నాజర్‌కుమంచి జరగాలని కోరుకుంటున్నవారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఆమె. సో…నాజర్‌ను వెండితెరపైచూడాలనుకునే మరింతమందికీ ఈ వార్త గుడ్‌ న్యూస్‌ అనే చెప్పుకోవాలి. (Actor Nassar to Quit Acting, All You Need to Know)

Related News

ట్రెండింగ్ వార్తలు