మీనా గంటకు అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా నటుడి కామెంట్స్ వైరల్!

February 22, 2024

మీనా గంటకు అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా నటుడి కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటి మీన ఒకరు. ఈమె బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్ర హీరోలందరి సరసన నటించారు. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి మీనా 2009వ సంవత్సరంలో ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఇలా పెళ్లి చేసుకున్నటువంటి మీనా సినిమాలకు కొంతకాలం పాటు విరామం ఇచ్చారు. ఒక కూతురు జన్మించిన తర్వాత కూతురు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమైనటువంటి మీనా ఇటీవల కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు కెరియర్ పరంగా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీ అయినటువంటి తరుణంలో తన భర్త మరణం ఎంతగానో కృంగదీసింది.

ఇలా భర్త మరణ వార్త నుంచి బయటపడినటువంటి మీనా తిరిగి ప్రస్తుతం సినిమాలలో బిజీ అయ్యారు. వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇదిలా ఉందిగా తాజాగా మీనాకు సంబంధించి ప్రముఖ నటుడు బైల్వాన్ రంగనాథ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు ఇస్తే ఎంతో మంచి గుర్తింపు వస్తుందని భావించి పిలిచి మరి ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వాలంటే లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మీనా ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కనుక ఇస్తే ఆమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటారని రంగనాథ్ వెల్లడించారు. ఈమె రెండు గంటల పాటు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంటే కనుక సుమారు 10 నుంచి 13 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు అంటూ రంగనాథ్ మీనా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: మళ్ళీ ఆయనే పుట్టాడు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నిఖిల్?

Related News

ట్రెండింగ్ వార్తలు