మళ్ళీ ఆయనే పుట్టాడు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నిఖిల్?

February 22, 2024

మళ్ళీ ఆయనే పుట్టాడు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నిఖిల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నిఖిల్ ఒకరు. ఈయన హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తన నటన ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించినటువంటి నిఖిల్ అనంతరం వరుసగా తెలుగు సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక ఇటీవల నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. నిఖిల్ 2020 వ సంవత్సరంలో పల్లవి అనే ఒక డాక్టర్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా నాలుగు సంవత్సరాల క్రితం వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇకపోతే ఇటీవల నిఖిల్ తన భార్య సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నానని మేమిద్దరం మా మొదటి బిడ్డకు స్వాగతం పలకడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము అంటూ నిఖిల్ తన భార్య సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ఇకపోతే బుధవారం పల్లవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే నిఖిల్ తన కొడుకు పుట్టాడనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఏడాది క్రితమే మా నాన్నను మిస్ అయ్యాను. ఆయనే ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చారని అనుకుంటున్నాను మగ బిడ్డ పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ నిఖిల్ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More: ఆ పని చేస్తే నన్ను చంపేస్తారు.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు