July 4, 2022
కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2019లో రిలీజైన ‘ఖైది’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధిం చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను అజయ్ దేవగన్ దక్కించుకున్నారు. ‘ఖైదీ’ హిందీ రీమేక్ ‘బోలా’ హీరోగా అజయ్‌దేవగనే నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. వచ్చే మార్చి 30న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ ఈ చిత్రం దర్శకుడు ధర్మేంద్ర శర్మను తొలగించి తానే దర్శకుడిగా రంగంలోకి దిగాడు అజయ్ దేవగన్. బహుశా..క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమో.
మరో విశేషం ఏంటంటే… కార్తి ఒరిజినల్ ‘ఖైది’లో హీరోయిన్ లేదు కానీ హిందీ రీమేక్ ‘బోలా’లో టబు హీరోయిన్‌గా కనిపిస్తున్నారు. సో..కథను అజయ్‌దేవగన్ కాస్త ఇటు అటుగా మార్చినట్లు ఉంది. ‘యు మి ఔర్ హమ్’, ‘శివే’, ‘రన్‌వే 34’ చిత్రాల తర్వాత అజయ్‌దేవగన్ దర్శకత్వంలో రాబోతున్న ఫోర్త్ ఫిల్మ్ ఇదే మరి..