మరోసారి దిల్ రాజుతో విజయ్ దేవరకొండ.. పక్కా మాస్ మూవీ?

May 4, 2024

మరోసారి దిల్ రాజుతో విజయ్ దేవరకొండ.. పక్కా మాస్ మూవీ?

సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఈయనకు మాత్రం ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోతోంది. లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి విజయ్ దేవరకొండకు పూర్తి నిరాశ కలిగిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఈయన సమంతతో కలిసి ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో మృణాల్ ఠాగూర్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉండేవి ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి.

ఇలా దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ దిల్ రాజు తన నిర్మాణ సంస్థలో మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.విజయ్ దేవరకొండతో ఓ రూరల్ యాక్షన్ డ్రామా చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు.

ఇలాంటి డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ మూవీగా కొత్త సినిమా చేయబోతున్నారని విషయం తెలియడంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఈ నెల 9వ తేదీ విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో బహుశా ఆ రోజే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అధికారకంగా వెల్లడించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్నానూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.

Read More: పిల్లల్ని కనడం పై నటి సంచలన వ్యాఖ్యలు… దేవుడు కరుణించాలంటూ ఎమోషనల్ కామెంట్!

ట్రెండింగ్ వార్తలు