త్రిష మెచ్చిన హీరో హీరోయిన్లు వీళ్లేనా… 25 ఏళ్లలో ఆమె సంపాదన ఎంతో తెలుసా?

May 4, 2024

త్రిష మెచ్చిన హీరో హీరోయిన్లు వీళ్లేనా… 25 ఏళ్లలో ఆమె సంపాదన ఎంతో తెలుసా?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి త్రిష ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పాతిక సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఇప్పటికే వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నటువంటి ఈమె కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.

ఇకపోతే నేడు త్రిష తన 41వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈమెకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిష నటిస్తున్నటువంటి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదలయ్యాయి. 25 ఏళ్ల సినీ కెరియర్లో ఈమె ఎన్నో సినిమాలలో నటిస్తూ భారీగానే ఆస్తులు కూడా సంపాదించారని తెలుస్తుంది..

ఇక త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా స్టార్ హీరోయిన్ లో కొనసాగుతున్నటువంటి ఈమెకు ఇండస్ట్రీలో కమల్ హాసన్, వెంకటేష్ అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే తనకు సిమ్రాన్ ఏంజలినా జోలీ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.

ఇక ఈమె ఆస్తుల విషయానికి వస్తే.. చెన్నైలో 15 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు, హైదరాబాద్లో 8 కోట్ల విలువచేసే ఇల్లు ఉంది.అలాగే కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇలా తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఈమె తన సినీ కెరియర్లో ఇప్పటి వరకు 150 కోట్ల వరకు ఆస్తులను సంపాదించారు. ఇక త్రిష ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Read More: ఆ ఒక్క భయంతో గజినీ రీమేక్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్.. ఏమైందంటే?

ట్రెండింగ్ వార్తలు