ఆ ఒక్క భయంతో గజినీ రీమేక్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్.. ఏమైందంటే?

May 4, 2024

ఆ ఒక్క భయంతో గజినీ రీమేక్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్.. ఏమైందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో కూడా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కమిట్ అయినటువంటి సినిమాలు అన్నిటిని కూడా పక్కన పెట్టి రాజకీయ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో వైరల్ గా మారింది పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలను చేసి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య హీరోగా నటించిన గజినీ సినిమా రీమేక్ హక్కులను తీసుకొని మేకర్స్ పవన్ కళ్యాణ్ ని కలిశారట.

ఇలా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి గజిని సినిమా గురించి వివరించడంతో పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. అయితే అలా రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదని ఈయన వెల్లడించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఎన్నో ప్రయోగాలు చేస్తారో వాళ్ళు డి గ్లామర్ లో నటించడానికి అయినా ఇష్టపడతారు. అక్కడ ప్రజలు వారిని అలాగే యాక్సెప్ట్ చేస్తారు కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా కాదు.

హీరో అంటే చాలా అందంగా గ్లామర్ గా కనిపించాలి అలా కనపడితేనే ప్రేక్షకులు ఇష్టపడతారు. గజినీ సినిమాలో సూర్య గుండు కొట్టించుకుంటాడు ఒళ్ళు మొత్తం టాటూలు వేయించుకొని కనిపిస్తారు. అలా నేను గుండు కొట్టించుకుంటే ప్రేక్షకులు చూస్తారా లేదా అన్న భయం నాలో ఉండేది అందుకే తాను ఈ సినిమాకి నో చెప్పాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: ప్రభాస్ లేకుండా సలార్ 2 షూటింగ్ .. రిలీజ్ అప్పుడేనా?

Related News

ట్రెండింగ్ వార్తలు