ప్రభాస్ లేకుండా సలార్ 2 షూటింగ్ .. రిలీజ్ అప్పుడేనా?

May 4, 2024

ప్రభాస్ లేకుండా సలార్ 2 షూటింగ్ .. రిలీజ్ అప్పుడేనా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే కల్కి సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానుంది. అయితే ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుని థియేటర్లలో దాదాపు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సలార్ 2 సినిమా కూడా ఈ ఏడాదిలోనే రాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రశాంత్ నీల్ వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది అయితే ప్రభాస్ లేకుండా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందట ప్రభాస్ తో సంబంధం లేకుండా ఇతర ఆర్టిస్టులతో ఉండే సన్నివేశాలు అన్నింటిని కూడా ప్రశాంత్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

కేవలం 5 నెలలలోనే ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని ప్రశాంత్ భావించినట్లు తెలుస్తోంది. ఇలా ఐదు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిన సలార్ 2 సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. వీలైనంత తొందరగా ఈ సినిమా పనులను పూర్తి చేస్తే త్వరలోనే ఎన్టీఆర్ సినిమా పనులలో బిజీ కావాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సలార్ 2 ఈ ఏడాదిలోనే రాబోతుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలియాలి అంటే అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

Read More: చై అన్నారా లేక చాయ్ అన్నారా.. శోభిత పోస్టుపై నెటిజెన్స్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు