చై అన్నారా లేక చాయ్ అన్నారా.. శోభిత పోస్టుపై నెటిజెన్స్ కామెంట్స్!

May 4, 2024

చై అన్నారా లేక చాయ్ అన్నారా.. శోభిత పోస్టుపై నెటిజెన్స్ కామెంట్స్!

శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల హాలీవుడ్ చిత్రం మంకీ మాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా ఏప్రిల్ 26వ తేదీ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

ఇలా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి శోభిత గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతుంది ఈమె నటుడు నాగచైతన్యతో రిలేషన్ లో ఉన్నారని, అయితే వీరి రిలేషన్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వీరి గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న వీరు మాత్రం ఈ వార్తలపై స్పందించిన దాఖలాలు లేవు అలాగే ఈ వార్తలను ఖండించను కూడా లేదు.

ఇలా వీరిద్దరి గురించి వార్తలు వస్తున్న ఈ జంట మౌనంగా ఉండడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్టు మరోసారి వీరిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్లకు సంకేతం ఇస్తుందనే చెప్పాలి. ఇటీవల ఇంస్టాగ్రామ్ వేదికగా శోభిత ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్ (chai), అండ్ దట్స్ ఓకే.. అని రాసుకొచ్చింది. దానికి అర్థం.. నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు.. అని.

సాధారణంగా ఎవరైనా టీ గురించి రాసేటప్పుడు వన్ కప్ ఆఫ్ టి అని రాస్తారు కానీ ఈమె మాత్రం Chai అని రాయడంతో టీ గురించే చెప్పారా లేకపోతే చైతన్య గురించి ఇలా కామెంట్స్ చేశారా అంటూ చాలామంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగచైతన్యను చాలామంది చై అంటూ పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శోభిత చైతన్యను ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారంటూ మరోసారి ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు.

Read More: మరోసారి దిల్ రాజుతో విజయ్ దేవరకొండ.. పక్కా మాస్ మూవీ?

ట్రెండింగ్ వార్తలు