పాత టైటిల్ తో కొత్త సినిమా.. రూట్ మార్చిన అల్లరి నరేష్!

February 19, 2024

పాత టైటిల్ తో కొత్త సినిమా.. రూట్ మార్చిన అల్లరి నరేష్!

అల్లరి నరేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇవీవీ సత్యనారాయణ కొడుకు అయినప్పటికీ, ఆ పేరు ఎక్కడా ఉపయోగించుకోకుండా సినిమాలో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన తర్వాత ఈవీవీ కొడుకుని అని చెప్పుకున్న ఘనత నరేష్ ది. కామెడీ సినిమాల దర్శకుడిగా తండ్రి పేరు గడిస్తే, కామెడీ హీరోగా నరేష్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఆమధ్య కెరియర్ లో కొంచెం ఫాల్డౌన్ అయినప్పటికీ గత ఏడాది ఉగ్రం, మారేడుపల్లి నియోజకవర్గం లాంటి మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కితకితలు సినిమాలో అల్లరి నరేష్ కమెడియన్ గా తన విశ్వరూపం చూపిస్తే, ఉగ్రం సినిమాలో నరేష్ తనలోని నిజమైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. నిజంగా అందులో నరేష్ నటనకి విమర్శకులు సైతం ప్రశంసించారు. అయితే ఇప్పుడు మళ్లీ తనకి అచ్చొచ్చిన కామెడీ జోనర్ లోకి వెళ్లి కామెడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి చేస్తున్నారు నరేష్.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాకి మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తండ్రి ఇవీవీ దర్శకత్వం వహించి, రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ రోజుల్లో ఆ ఒక్కటీ అడక్కు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ నరేష్ సినిమాకి పెట్టడంతో మరింత కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

ప్రస్తుతం రిలీజ్ అయిన గ్లింప్స్ ని చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. అలాగే సినిమా మొత్తం అల్లరి నరేష్ పెళ్లి కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవాహర్ష,అరియానా గ్లోరీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read More: ఘ‌నంగా సూప‌ర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి ట్రైల‌ర్ లాంచ్..

ట్రెండింగ్ వార్తలు