‘బింబిసార’పై స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కళ్యాణ్ రామ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్..

August 7, 2022

‘బింబిసార’పై స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కళ్యాణ్ రామ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్..

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ మూవీ విజయంపై పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై ఐకాన్‌ స్టార్ అ‍ల్లు అర్జున్‌ స్పందించారు. బింబిసార టీమ్‌కు అభినందనలు. ఇది ఒక ఒక‌ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్‌ ఫాంట‌సీ చిత్రం.

‘కళ్యాణ్‌రామ్ నటన అద్భుతంగా ఉంది. ఎప్పుడూ ఇండ‌స్ట్రీకి కొత్త టాలెంట్‌ను ప‌రిచ‌యం చేస్తున్నందుకు, కొత్త త‌ర‌హా సినిమాల‌ను చేస్తున్నందుకు ఆయ‌నంటే నాకు ఎప్పటికీ గౌరవమే.డెబ్యూ డైరెక్టర్‌ వశిష్ఠ ఈ చిత్రాన్ని చక్కగా హ్యాండిల్‌ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన కీరవాణి గారు, కేథరీన్‌, సంయుక్త మీనన్‌లకు అభినందనలు’ అంటూ బన్నీ ట్వీట్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు