August 7, 2022
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్ ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. బన్నీకి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహారెడ్డి మంచి ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో సూపర్ స్టైలిష్ లుక్‌లో కనపిస్తుందామె. ఇక ఈ ఫోటోపై నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు నెటిజన్లు సైతం సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్‌కు ఏ మాత్రం తీసుపోకుండా ఉన్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
View this post on Instagram