ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తరువాత పెళ్లి.. అమలా పాల్‌, సెలెబ్రిటీల తీరుపై నెటిజన్ల కామెంట్లు

January 4, 2024

ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తరువాత పెళ్లి.. అమలా పాల్‌, సెలెబ్రిటీల తీరుపై నెటిజన్ల కామెంట్లు

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి వారందరూ అమ్మలుగా ప్రమోట్ అవుతూ ఉన్నారు. అయితే తాజాగా మరో నటి కూడా తాను అమ్మని కాబోతున్నాను అనే శు భ వా ర్త ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే. సౌత్ ఇండ స్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అమలాపాల్ ఒకరు.

ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తమిళ తెలుగు భాష చిత్రాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్ష కులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె తాను తల్లి కాబోతున్నాను అనే శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారగా ఎంతో మంది అభి మానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

అమలాపాల్ ఇదివరకే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక డైరెక్టర్ తో ప్రేమలో పడి ఆయనని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఏడాది అనంతరం ఆ డైరెక్టర్ కి విడాకులు ఇచ్చి సింగిల్గానే గడుపుతున్నారు. అయితే ఈమె గత కొంతకాలంగా గోవాకి చెందిన జగత్ దేశాయ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ చివరి వారంలో తన ప్రియుడిని పరిచయం చేసినటువంటి ఈమె నవంబర్ 5వ తేదీ పెళ్లి చేసుకున్నారు.

ఈమె తన రెండవ వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలోను సన్నిహితుల సమక్షంలోనే ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుక జరిగి రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈమె తల్లి కాబోతున్నాను అంటూ గుడ్ న్యూస్ అందరికీ తెలియజేశారు. అంతేకాకుండా తన బేబీ బంప్ ఫోటోలను కూడా అభిమా ను లతో పంచుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

పెళ్లయి రెండు నెలలు కూడా కాకుండానే రెండు నెలల ప్రెగ్నెంట్ కావడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఏదో తేడాగా ఉందే ముందుగానే ప్రెగ్నెంట్ అయి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారా అంటూ ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ కూడా కడుపు తెచ్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటున్నటువంటి సంఘటనలను మనం తరచు చూస్తున్నాము. అలా అమలాపాల్ కూడా ముందు కడుపు తర్వాత పెళ్లి అంటూ ఈమె తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.

Read More: దిల్ రాజు పెత్తం దారి వ్యవస్థను ప్రశ్నించిన ‘హనుమాన్’ నిర్మాత?

ట్రెండింగ్ వార్తలు