August 30, 2022
రీసెంట్‌గా విడుదలైన కడవర్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది అమలాపాల్, తనే స్వయంగా నిర్మించి నటించిన కడవర్ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్షకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కడవర్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అమలాపాల్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి సినిమాకు సంబందించి కాదు…బిజినెస్ లావాదేవీలలో తనను మోసం చేశాడని, తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని నటి అమలా పాల్…తన మాజీ ప్రియుడు పవీంధర్ సింగ్ పై విల్లుపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. అమలాపోల్, పవింధర్ సింగ్ సంయుక్తంగా 2018లో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు, అయితే వారిద్దరూ మధ్య వ్యాపార ఒప్పందాల విషయంలో తేడా రావడంతో విడిపోయారు. అమాలపాల్ ..ఆ నిర్మాణ సంస్థలో భారీగా పెట్టుబడి పెట్టింది. అయితే కంపెనీ డైరెక్టర్‌గా అమలా పాల్‌ను తొలగిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశాడని, తన ప్రైవేట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నడని అని అమలా పాల్ పోలీస్ లకు వివరించారు.
పవిందర్ సింగ్ పై 16 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విల్లుపురం పోలీసులు ఫోర్జరీ, బెదిరింపు, వేధింపులతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. పవిందర్ సింగ్ మిత్రులు కూడా ఆమెను లైంగికంగా వేదిస్తుండడంతో 11మందిపై కేసులు నమోదు చేశారు. వారికోసం పోలీస్ లు గాలిస్తున్నారు.