ఆ నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసిన సోనాలి బింద్రే.. అందుకు పాల్పడ్డారు అంటూ?

May 4, 2024

ఆ నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసిన సోనాలి బింద్రే.. అందుకు పాల్పడ్డారు అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సోనాలి బింద్రే. 1994లో ఆగ్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుని ఏర్పరచుకొన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

తరువాత ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు ఇలా వరుస హిట్స్ ఇచ్చింది. 2004లో విడుదలైన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో నటించలేదు. ప్రస్తుతం సోనాలీ బింద్రే వెబ్ సిరీస్లు చేస్తుంది. అందులో భాగంగానే ఆమె నటించిన ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సోనాలీ బింద్రే సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సోనాలీ బింద్రే మాట్లాడుతూ.. నేను 1994లో పరిశ్రమలో అడుగుపెట్టాను.

అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. నిర్మాతలు కూడా అలానే ఉండేవారు. నా తోటి నటులతో ఎఫైర్ రూమర్స్ క్రియేట్ చేసేవారు. అలా చేస్తే సినిమాకు ప్రచారం దక్కుతుందని భావించేవారు. మీడియాకు నిర్మాతలు స్వయంగా లీక్స్ ఇచ్చేవారు. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో నేను సన్నగా ఉండేదాన్ని. అప్పట్లో హీరోయిన్స్ కొంచెం బొద్దుగా ఉండేవారు. నన్ను కూడా లావు కావాలని ఒత్తిడి చేసేవారు. నాపై బాడీ షేమింగ్ కి పాల్పడుతూ ఎగతాళి చేసేవారు. బొద్దుగా అవ్వాలని ఎందరు క్లాస్ పీకినా నేను వినలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు. అందుకే డాన్సు, యాక్టింగ్ నేర్చుకుంది లేదు. పరిశ్రమకు వచ్చాకే అన్నీ నేర్చుకున్నాను. నన్ను ఫ్యాన్స్ స్టార్ హీరోయిన్ చేస్తారని అసలు ఊహించలేదు అని తెలిపింది సోనాలి బింద్రే.

Read More: సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సామ్.. నెట్టింట వీడియో వైరల్?

ట్రెండింగ్ వార్తలు