సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సామ్.. నెట్టింట వీడియో వైరల్?

May 4, 2024

సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సామ్.. నెట్టింట వీడియో వైరల్?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకుంది. ఇకపోతే సోషల్ మీడియాలో సాయి పల్లవికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా మొదట ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో సాయి పల్లవి యాక్టింగ్, డాన్స్, లుక్స్ చూసి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నాగ చైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తోంది. అలాగే హిందీలో రామాయణ్ చిత్రంలో సీత పాత్ర పోషిస్తుంది. తాజాగా న్యాచురల్ బ్యూటీకి సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. అందులో సాయి పల్లవి డాన్స్ చూసి ఫిదా అయిపోయింది హీరోయిన్ సమంత. న్యాచురల్ బ్యూటీ టాలెంట్ పై ప్రశంసలు కురిపించింది సామ్. కొన్నేళ్ల క్రితం సాయి ప్లలవి ఢీ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ షోకు అప్పట్లో సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఆ సమయంలో సాయి ప్లలవి డాన్స్ చూసి ఫిదా అయిపోయింది సమంత. తన డాన్స్ చూస్తూ మాటలు రావడం లేదని. చూపు తిప్పుకోలేకపోయాను. అంత అద్భుతంగా డాన్స్ చేశావంటూ ప్రశంసలు కురిపించింది సమంత.

Read More: Aa Okkati Adakku Review: అల్ల‌రోడు త‌న తండ్రి క్లాసిక్ టైటిల్‌తో హిట్ కొట్టాడా?

ట్రెండింగ్ వార్తలు