ఖుష్బూ పై అలాంటి వాఖ్యలు చేసిన భర్త సుందర్.. మరో పెళ్లి చేసుకోమని చెప్పిందంటూ?

May 4, 2024

ఖుష్బూ పై అలాంటి వాఖ్యలు చేసిన భర్త సుందర్.. మరో పెళ్లి చేసుకోమని చెప్పిందంటూ?

ఒకప్పటి సీనియర్ నటి రాజకీయ నాయకురాలు కుష్బూ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ తమిళనాడులో భారీగా ఫాన్స్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉండే ప్రస్తుతం ఈమె ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరొకవైపు బుల్లితెరపై ప్రసారం అయ్యే పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

అలాగే సమాజంలో జరిగే పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. కాగా ప్రస్తుతం ఈమె రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఒక వైపు రాజకీయాల్లో రాణిస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఖుష్భు. ఖుష్భు భర్త గురించి చాలా మందికి తెలియదు. అతను ప్రముఖ నటుడు, నిర్మాత సుందర్ సి. ఈయన హారర్ నేపథ్యంలో తెరకెక్కిన అరణ్మనై సినిమాల్లో నటిస్తూ నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ సిరీస్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు అరణ్మనై 4 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకు బాక్ అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీమ్ పాల్గొంటున్నారు. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుందర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భార్య ఖుష్భు గురించి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. తనకు పిల్లలు పుట్టరని తెలిసి ఖుష్భు చాలా కుమిలిపోయింది. నేను చెప్పేది పెళ్ళికి ముందు జరిగిన విషయం. అప్పుడు ఖుష్బూ అనారోగ్యానికి గురైంది. అయితే ఆమెకు పిల్లలు పుట్టరని ఒక వైద్యుడు మాతో అన్నడు. అది విని తను ఎంతో బాధపడింది. తనలో తానే కుమిలిపోయింది. అప్పుడు నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బు ఏడ్చింది. కానీ నేను పిల్లలు పుట్టక పోయినా సరే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ మమ్మల్ని దేవుడు మరోలా దీవించాడు. మాకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని చెప్పుకొచ్చారు సుందర్.

Read More: ఆ నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసిన సోనాలి బింద్రే.. అందుకు పాల్పడ్డారు అంటూ?

ట్రెండింగ్ వార్తలు