July 4, 2022
అరెస్ట్ లీలామణిమేకలై’ అనే హ్యాష్‌టాగ్ సోషల్‌మీడియాలో ఉన్నట్లుండి హఠాత్తుగా తెరపైకి వచ్చింది. కుష్భూ వంటి స్టార్స్ కొందరు లీలాపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇంతకీ..దర్శకురాలు లీలా ఏం చేశారనేగా మీ సందేహాం అక్కడికే వస్తుంది. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అయిన లీలా ‘కాళి’ అనే డాక్యూమెంటరీ ఫిల్మ్‌ను తీస్తున్నట్లుగా ప్రకటించి, ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్‌లో కాళి మాత వేషధారణలో ఉన్న ఓ మహిళ సిగరేట్ తాగుతున్నట్లుగా ఉంది.
దీంతో ఒక్కసారిగా సోషల్‌మీడియా భగ్గు మంది. లీలాను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశాలపై లీలా స్పందించారు. ‘‘ఓ రోజు సాయంత్రం టొరొంటో (కెనడా దేశంలోని ఓ పట్టణం) వీధుల్లో జరిగే సంఘటనల సమహారంగా ‘కాళి’చిత్రం ఉంటుంది. పోస్టర్‌ను చూసి అరెస్ట్ లీలామణిమేకలై అని ట్రోల్ చేయకండి, లవ్యూ లీలామణిమేకలై అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయండి అని లీలా సోషల్‌మీడియాలో స్పందించారు. మరి..ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి మరి