బిగ్ బాస్ ఆది రెడ్డి కొత్త ఇంటిని చూశారా?

March 16, 2024

బిగ్ బాస్ ఆది రెడ్డి కొత్త ఇంటిని చూశారా?

ఒక సాధారణ వ్యక్తిగా తన జీవనం గడుపుతూ పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉన్నటువంటి ఆదిరెడ్డి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిపోయారు. బీటెక్ పూర్తి చేసి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి ఆదిరెడ్డి బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూ ఇస్తూ సెలబ్రిటీగా మారిపోయారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమానికి రివ్యూ ఇస్తూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఒక కామన్ మ్యాన్ గా ఎంతో మంచి ఆదరణ పొందినటువంటి ఆదిరెడ్డి ఏకంగా సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొని టాప్ త్రీ కంటెంట్ గా బయటకు వచ్చారు. ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమం వెళ్లి వచ్చినప్పటి నుంచి ఈయనని అనుసరించే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది ఇలా యూట్యూబ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం పొందుతూ ఉన్నటువంటి ఆదిరెడ్డి ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

కేవలం బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడం ద్వారా తను నెలకు 30 లక్షలకు పైగా సంపాదన అందుకున్నాను అంటూ ఇటీవల ఒక వీడియోని విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు.. ఇక ఈయన మాత్రమే కాకుండా తన భార్య కవిత చెల్లెలు నాగలక్ష్మి కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి భారీగానే సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు సెలూన్ బిజినెస్ రంగంలోకి కూడా ఆదిరెడ్డి అడుగు పెట్టారు.

ఇలా సెలబ్రిటీగా మారినటువంటి ఈయన తాము ఉండటానికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో తన డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నారు. ఇలా తన సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం ఈయన ఎంతగానో కష్టపడుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు అయితే తాజాగా ఈయన గృహప్రవేశం చేశారని తెలుస్తుంది. అయితే ఈ ఇంటి నిర్మాణ పనులు ఇంకా జరుగుతూ ఉండగా కొన్ని కారణాల వల్ల ముందుగానే ఈయన గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గృహప్రవేశనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Read More: రాష్ట్రపతిని కలిసిన ఉపాసన క్లిన్ కారా!

Related News

ట్రెండింగ్ వార్తలు