మహేశ్‌బాబును ఫాలో అవుతున్న బిల్‌గేట్స్‌

July 2, 2022

మహేశ్‌బాబును ఫాలో అవుతున్న బిల్‌గేట్స్‌

Bill Gates Follows Mahesh Babu On Social Media: ప్రపంచ అపరకుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్, సూపర్‌స్టార్ మ‌హేశ్ జూన్‌ 29న న్యూ యార్క్‌లో కలుసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో మహేశ్‌బాబు, బిల్‌గేట్స్‌ బాగానే మాట్లాడుకున్నట్లున్నారు. ఎందుకంటే…ఇప్పుడు మహేశ్‌బాబు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్స్‌లో మహేశ్‌బాబును బిల్‌గేట్స్‌ ఫాలో అవుతున్నారు(Bill Gates Follows Mahesh Babu On Social Media). ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్‌ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటారు. మరే..ఇతర హీరో సాధించలేని ఫీట్‌ను తమ హీరో సాధించినందకు గర్వంగా ఫీలవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే…ప్రస్తుతం ఫారిన్‌ వేకేషన్‌లో ఉన్న మహేశ్‌బాబు ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటిస్తారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి సినిమాలో యాక్ట్‌ చేస్తారు మహేశ్‌బాబు.

Read More: మోహన్‌బాబు అగ్నినక్షత్రంలో ట్విస్ట్‌ ఇదే మరి!  

ట్రెండింగ్ వార్తలు