Bramhastram Review: బ్ర‌హ్మాస్రం సినిమా ఎలా ఉందంటే?

September 9, 2022

Bramhastram Review: బ్ర‌హ్మాస్రం సినిమా ఎలా ఉందంటే?

  • Cast : , ,
  • Director :
  • Producer :
  • Banner :
  • Music :

/ 5

పూర్వం కొంత‌మంది బుషులు కలిసి చాలా ఏళ్ళ‌పాటు త‌ప‌స్సు చేయ‌గా దానికి ప్ర‌తిఫ‌లంగా కొన్ని అస్రాలు జ‌నిస్తాయి. అయితే చివ‌ర‌గా ఈ అస్త్రాలన్నింటికి దేవత ‘బ్రహ్మాస్త్రం`ఉద్భ‌విస్తుంది. దానికి ఈ లోకంలోని స‌మ‌స్త మ‌నుగ‌డ‌ను నాశ‌నం చేయ‌డం లేదా తిరిగి సృష్టించేంత శ‌క్తి ఉంటుంది.

బ్ర‌హ్మాన్ష్ అనే ఆశ్ర‌మానికి చెందిన కొంత‌మంది ఆ బ్ర‌హ్మాస్రాన్ని కాపాడుతుంటారు. అప్ప‌టికే కొన్ని అస్రాల శ‌క్తిని సొంతం చేసుకున్న దేవ్ ఆ బ్ర‌హ్మాస్రాన్ని ద‌క్కించుకుని బ్ర‌హ్మ‌దేవ్ అవ్వాల‌నే క‌ల‌తో ఆ ఆశ్ర‌మంలోని అంద‌రిని ఓడిస్తాడు. అయితే అత‌డి ప్రేయ‌సి అత‌ని నుండి బ్ర‌హ్మాస్రాన్ని కాపాడి మూడు భాగాలుగా చేస్తుంది.

అందులో ఒకటి సైంటిస్ట్ మోహన్ భార్గవ్ (షారూఖ్ ఖాన్) దగ్గర, మరొకటి ఆర్టిస్ట్ అనీష్ శెట్టి (అక్కినేని నాగార్జున) దగ్గర ఉంటుంది. మూడోది డీజే శివ (ర‌ణ్‌బీర్‌ కపూర్) ద‌గ్గ‌ర ఉంటుంది. ఈ బ్ర‌హ్మాస్రాన్ని కాపాడే క్ర‌మంలో వానర అస్త్రం అయిన మోహన్ భార్గవ్‌ను, నంది అస్త్రం అయిన అనీష్ శెట్టి మరణిస్తారు. దాంతో ఆ రెండు అస్రాల శక్తి కూడా శత్రువుల‌కి అందుతుంది.

స్వ‌యంగా అగ్ని అస్రం అయిన శివ‌, త‌న ప్రేయ‌సి ఈషా(ఆలియా భ‌ట్‌)తో క‌లిసి బ్ర‌హ్మాన్ష్ గురువు( అమితాబ్ బ‌చ్చ‌న్‌) స‌హాయంతో బ్ర‌హ్మాస్తాన్ని దేవ్ బృందానికి అంద‌కుండా కాపాడారా లేదా అన్నది మిగ‌తా క‌థ‌

దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంపిక చేసుకున్న కథాంశం బాగుంది కానీ, దానిని ఆస‌క్తిక‌ర‌మైన కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో ఫెయిల్ అయ్యారు. ఒక్క వీఎఫ్ఎక్స్ విషయంలో తప్ప… మిగతా విషయాల్లో ఆయన శ్రద్ధ వహించినట్లు అనిపించదు.

సినిమా స్టార్టింగులో షారూఖ్ ఖాన్ అదరగొట్టారు. ఆయన వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలు అవుతుంది. అయితే… ఆ ఆసక్తి సన్నగిల్లేలా చాలా సేపు ప్రేమకథతో సినిమాను నడిపించారు దర్శకుడు.

ర‌ణ్‌బీర్ స్వ‌యంగా అగ్ని అస్త్రం అని చెబుతారు. అయితే… తానొక అగ్ని అని తెలుసుకునే సన్నివేశాల్లో గానీ, ఆ తర్వాత అతడిపై తీసిన సన్నివేశాల్లో గానీ ఎక్కడా ఫైర్ ఉండదు.

ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. ప్రేమ సన్నివేశాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంది.

ఇంటర్వెల్ తర్వాత అయినా దైవ శక్తి, దుష్ట శక్తి మధ్య పోరుతో సినిమాను రసవత్తరంగా మారుస్తారని అనుకుంటే… అదీ చేయలేదు. మళ్ళీ ప్రేమకథపై కాన్సంట్రేట్ చేసి ప్రేక్షకులకు డిజప్పాయింట్ చేశారు.

అనీష్ శెట్టి పాత్రలో కింగ్ నాగార్జున నటన బావుంది. కనిపించింది కాసేపే అయినప్పటికీ… ప్రభావం చూపించారు. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు. చివ‌ర్లో బ్ర‌హ్మాస్రం పార్ట్ 2 దేవ్ ఉంటుంద‌ని లీడ్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు.

 

ట్రెండింగ్ వార్తలు