April 29, 2024
సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుకుమార్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయం అందుకోవడంతో డైరెక్టర్ సుకుమార్ పేరు కూడా భారీ స్థాయిలో మారుమోగిపోయింది.
ఈ విధంగా సుకుమార్ పుష్ప సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం పుష్ప2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తర్వాత ఆయన స్నేహితుడి పాత్ర కేశవ పాత్రకు భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పాలి. అయితే ఈ పాత్రలో ముందుగా టాలీవుడ్ యంగ్ హీరోని తీసుకోవాలని సుకుమార్ భావించినట్లు ఇటీవల తెలియజేశారు.
సుకుమార్ హీరోగా నటించిన ప్రసన్న వదనం అనే సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలకు సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో భాగంగా కేశవ పాత్ర గురించి మాట్లాడుతూ నిజానికి తాను కేశవ పాత్రలో హీరో సుహాస్ ను తీసుకోవాలని భావించాను కానీ ఈయన తన సినిమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో తనని డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఆగిపోయానని తెలిపారు.
సుహాస్ మట్టిలో నుంచి పుట్టిన స్టార్ అని తెలిపారు ఈయన సక్సెస్ కనుక చూస్తుంటే త్వరలోనే నాచురల్ స్టార్ నాని రేంజ్ కు ఎదుగుతారు అంటూ సుకుమార్ సుహాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా పుష్ప సినిమాలో కేశవ పాత్రలో సుహాస్ నటించాల్సి ఉండేది అంటూ ఈ సందర్భంగా సుకుమార్ కామెంట్ చేయడంతో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.
Read More: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్.. ఈ సారి హిట్ గ్యారెంటీ అంటున్న అభిమానులు?