నేను ప్యాకేజీ తీసుకోలేదు.. ఎన్నికలవేళ రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు?

April 27, 2024

నేను ప్యాకేజీ తీసుకోలేదు.. ఎన్నికలవేళ రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు?

ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి నెలకొంది ఈ క్రమంలోనే పలువురు అభ్యర్థుల తరఫున సినిమా సెలబ్రిటీలు కూడా మద్దతు నిలబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీనటి రేణు దేశాయ్ సైతం బిజెపి పార్టీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే ఇటీవల ఆమె కమలం గుర్తులు చేతిపై టాటుగా వేయించుకొని ఆ పార్టీ పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు.

ఇలా ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈమె సోషల్ మీడియా వేదిక చేసినటువంటి పోస్ట్ రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఒకవైపు ఆంధ్రలో తన మాజీ భర్త ఎన్నికల బరిలో దిగిన నేపథ్యంలో ఈమె ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. తెలంగాణలో మే 13వ తేదీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి స్థానం నుంచి మాధవి లత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా మాధవి లత ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె చాలా రోజుల తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూసానని తెలిపారు.తాను ఈ పోస్ట్ పెట్టడానికి ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, నాకు చెప్పాలనిపించి చెప్పానని తెలియజేశారు.

ఇలా నేను డబ్బు తీసుకొని ఈమెను పొగడడం లేదు అంటూ రేణు దేశాయ్ చెప్పడంతో బహుశా ఈమె పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పరోక్షంగా ఇలాంటి కామెంట్స్ చేశారని తెలిసింది పవన్ కళ్యాణ్ ని ఏపీలో ప్యాకేజి స్టార్ అంటూ పిలుస్తూ ఉంటారు దీంతో రేణు దేశాయ్ తాను ఎలాంటి ప్యాకేజ్ తీసుకోలేదంటూ చెప్పకనే చెప్పారని పలువురు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

Read More: ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ కొన్న అల్లు అరవింద్.. ధర ఎంత అంటే?

ట్రెండింగ్ వార్తలు