April 27, 2024
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న మధురానగరీలో అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది కీర్తి భట్. ఈమె బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మధ్య బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. మొన్నీమధ్య కుమారి ఆంటీ ఫుడ్ పై వీడియో చేసి వైరల్ అయ్యింది కీర్తి భట్.
కాగా 2019లో మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో భానుగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో హిమ పాత్రలో కనిపించి మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. ఇప్పుడు అడియన్స్ అందరికి తెలిసిన కీర్తి జీవితంలో ఎన్నో కష్టాలు చేదు రోజులు ఉన్నాయి. సీరియల్స్ లోకి రాకముందే ఆమె జీవితంలో పెను విషాదం నెలకొంది. కొన్నేళ్ల క్రితం కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదినలను కూడా కోల్పోయింది.
కీర్తి ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసింది. మంగుళూరు నుంచి బెంగుళూరు చేరుకుని అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. సీరియల్స్, బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు కాబోయే భర్తతో కలిసి యూట్యూబ్ వీడియోస్, ఇన్ స్టాలో రీల్స్ చేస్తుంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కష్టాలను చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా కీర్తి మాట్లాడుతూ..ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగుళూరుకు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. తెలుస్తుంది. కానీ స్పర్శలేకపోవడం వల్ల నెట్టేయడానికి బలముండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే 200 ఇస్తా వస్తావా అంటే సరే వస్తానని అనేదాన్ని. ఆ తర్వాత వాళ్ల లుక్స్ చూసి అర్థమయ్యేది అంటూ చెప్పుకొచ్చింది కీర్తి.
Read More: కుర్చీ మడతపెట్టి సాంగ్ విని పొట్టలో బేబీ తంతున్నాడు.. ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్స్ వైరల్?