April 27, 2024
రాజ్& డికె నిర్మించిన “సినిమా బండి”తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రంతో మరో ఆకర్షణీయమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా తన తొలి నిర్మాణంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీని గుర్తించడానికి సిద్ధంగా ఉంది. సమంత, రాజ్ & డీకే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేశారు.
మహిళా కథానాయకుల చుట్టూ కేంద్రీకృతమై కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శనా రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత ప్రధాన పాత్రలు పోహిస్తున్నారు. ఆకట్టుకునే డ్రామాతో రూపొందుతున్న ఈచిత్రానికి “పరదా” అనే ఆసక్తికరమైన టైటిల్ లాక్ చేశారు.
పరదా అంటే కర్టెన్. పరదా లేకుండా అనుపమ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనుపమ సాంప్రదాయ దుస్తులలో, వోనితో ముఖాన్ని కప్పి ఉంచే మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి కనిపిస్తుంది. అనుపమ తీక్షణంగా చూస్తోంది. ఆమె గత సినిమాలోలా కాకుండా డి-గ్లామ్ పాత్రలో కనిపించనుంది.
కాన్సెప్ట్ వీడియో విలేజ్ సెటప్‌లో దేవత విగ్రహాన్ని చూపుతుంది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియా, మనుస్మృతిలోని ప్రసిద్ధ శ్లోకం వినబడుతుంది. దీని అర్ధం.. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజింపబడతారు. స్త్రీలు ఎక్కడ అవమానించబడతారో, ఎంత శ్రేష్ఠమైనప్పటికీ ఆ చర్యలు ఫలించవు. శ్లోకం సినిమా ఇతివృత్తాన్ని వివరిస్తుంది.
ఎన్నో ప్రశంసలు పొందిన ‘హృదయం’, ‘జయ జయ జయ జయ హే’ చిత్రాలలో పాపులరైన తర్వాత దర్శన రాజేంద్రన్ పరదా చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది తెలుగు, మలయాళంలోని ఆమె అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది. మేలో హైదరాబాద్‌లో షెడ్యూల్ చేయబడిన చివరి దశ షూటింగ్ కోసం టీం ఉత్సాహంగా సిద్ధమౌతోంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ, “పరదా”తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాకుండా లోతుగా ప్రతిధ్వనింపజేసే ఆకట్టుకునే కథనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
ఆనంద మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న “పరదా” ఆకర్షణీయమైన కథాంశం, ప్రతిభావంతులైన తారాగణం, ఆకట్టుకునే పాటలతో ప్రేక్షకులను అలరించనుంది. “మా సినిమా కథ మాత్రమే కాదు, ఒక అనుభవం, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణం” అంటూ నిర్మాత విజయ్ డొంకాడ “పరదా” సినిమాపై ఆనందం వ్యక్తం చేశారు.
గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా విడుదలకు సమీపంలో ఉన్నందున మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌ల రాబోతున్నాయి.
Read More: డబ్బులు ఇస్తాను వస్తావా అనేవారు.. సంచలన విషయాలు బయటపెట్టిన కీర్తి భట్?