కుర్చీ మడతపెట్టి సాంగ్ విని పొట్టలో బేబీ తంతున్నాడు.. ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్స్ వైరల్?

April 27, 2024

కుర్చీ మడతపెట్టి సాంగ్ విని పొట్టలో బేబీ తంతున్నాడు.. ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీల కలిసి నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 270 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి. మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ అయితే బాగా వైరల్ అయింది. ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు ఈ పాటు మారు మోగిపోయింది. కుర్చీ మడతబెట్టి అనే ఒక వైరల్ పదం తీసుకొని దాంతో స్పెషల్ సాంగ్ రాయగా థమన్ ఇచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్, శ్రీలీల, మహేష్ సినిమాలో వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్ద రిల్లాయి. థియేటర్స్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇటీవల యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఏకంగా 200 మిలియన్స్ వ్యూస్ సాధించి మరోసారి వైరల్ అయింది.

ఈ క్రమంలో యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ కింద కామెంట్స్ లో ఒక ప్రగ్నెంట్ వుమెన్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది. అన్విత జోబి అనే అకౌంట్ నుంచి కుర్చీ మడత పెట్టి వీడియో సాంగ్ కింద కామెంట్స్ లో నేను ఇప్పుడు ఆరు నెలల ప్రగ్నెంట్, ఈ పాట ప్లే అయిన ప్రతి సారి కడుపులో బిడ్డ పొట్టని తంతున్నాడు అంటూ కామెంట్ చేసింది ఒక నెటిజన్. ప్రస్తుతం ఈ ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్ వైరల్ గా మారింది. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆరు నెలలకే లోపల బేబీ తంతున్నాడా? ఊరికే ఇలా కామెంట్ పెట్టిందేమో, అయితే పెద్దయ్యాక ఆ బేబీ డాన్సర్ అవుతాడేమో, థమన్ కడుపులో పిల్లల్ని కూడా తన మ్యూజిక్ తో కదిలిస్తున్నాడు అంటూ ఆమెపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

Read More: నేను ప్యాకేజీ తీసుకోలేదు.. ఎన్నికలవేళ రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు?

ట్రెండింగ్ వార్తలు