విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్.. ఈ సారి హిట్ గ్యారెంటీ అంటున్న అభిమానులు?

April 29, 2024

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్.. ఈ సారి హిట్ గ్యారెంటీ అంటున్న అభిమానులు?

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలి అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదిని మారుస్తూ మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు. కానీ ఆ డేట్ కు కాకుండా మళ్ళీ వాయిదా వేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది.

టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఖరారు చేశారు. ఈ మూవీ వచ్చే నెల మే 17 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే టీజర్ మాత్రం అదిరిపోయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్న అమ్మవారి నేపథ్యంలో టీజర్ కట్ చేసారు. విశ్వక్ సేన్ మాస్ అవతారం టీజర్ లో సర్ప్రైజింగ్ అనిపించేలా ఉంది. యాక్షన్ ఎపిసోడ్ లో విశ్వక్ సేన్ అమ్మోరు పూనేసిందిరా.. ఇక ఈ రాత్రి ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్ది అంటూ అదిరిపోయే డైలాగ్ తో ఆకట్టుకున్నాడు విశ్వక్ సేన్.

నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలియదు. కానీ మంచోడు అనే చెడ్డ పేరు నాకొద్దు అంటూ తన క్యారెక్టర్ ని విశ్వక్ సేన్ చెప్పకనే చెబుతున్నాడు. ఇకపోతే ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో విశ్వక్ నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి. దాంతో అదే ఊపుతూ విశ్వక్ సేన్ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

Read More: అనుపమ పరమేశ్వరన్ మూవీ పరదా ఫస్ట్ లుక్

ట్రెండింగ్ వార్తలు