April 30, 2024
తెలుగు ప్రేక్షకులకు నటి కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. కోవై సరళ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె హెలేరియస్ కామెడీ. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేయగలనాటి కోవై సరళ. ఇక ఆమె కామెడీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో బ్రహ్మానందం,కోవై సరళ జంటగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులని నవ్వించి మెప్పించారు.
అందం కోవై సరళ కాంబినేషన్ అంటే ఇక నవ్వుల వర్షమే అని చెప్పాలి. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు. తెలుగులో బెస్ట్ ఫిమేల్ కమెడియన్ గా ఇరవై ఏళ్ళ పాటు కొనసాగారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో కూడా ఎక్కడా ఎక్కువగా కనిపించట్లేదు. తెలుగులో చివరిసారిగా 2015లో కిక్ 2 సినిమాలో కనిపించింది కోవై సరళ. ఆ తర్వాత నాలుగు డబ్బింగ్ సినిమాలతో పలకరించింది. మళ్ళీ ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది కోవై సరళ.
తమిళ్ లో సూపర్ హిట్ హారర్ కామెడీ సిరీస్ అరణ్‌మనై కి నాలుగో సీక్వెల్ రాబోతుంది. తమిళ్ లో అరణ్‌మనై 4 గా రాబోతున్న ఈ సినిమా తెలుగులో బాక్ గా రిలీజ్ కాబోతుంది. కుష్బూ నిర్మాణంలో, కుష్బూ భర్త మెయిన్ లీడ్ చేస్తూ ఆయన దర్శకత్వంలోనే ఈ అరణ్‌మనై 4 సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా, తమన్నా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మే 3న తమిళ్, తెలుగు భాషల్లో అరణ్‌మనై 4 సినిమా రిలిజ్ కాబోతుంది. తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో బాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశి ఖన్నాతో పాటు కోవై సరళ కూడా వచ్చారు. అయితే కోవై సరళ గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. కొద్దిసేపు ఆమెను అలాగే చూస్తే తప్ప ఆమె ఎవరు అన్నది గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయింది కోవై సరళ. ఏజ్ పెరిగిపోవడంతో ముఖంలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. హెయిర్ కట్ తో కళ్లజోడు పెట్టుకొని కనిపించారు. బాక్ ఈవెంట్ నుంచి కోవై సరళ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కోవై సరళ చాలా మారిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంత మారిపోయినా అదే సరదా, అల్లరి, కామెడీతో నిన్న ఈవెంట్లో అందర్నీ నవ్వించారు.
Read More: హీరోయిన్ రష్మికలో ఈ టాలెంట్ కూడా ఉందా.. నెట్టింట వీడియో వైరల్!