హీరోయిన్ రష్మికలో ఈ టాలెంట్ కూడా ఉందా.. నెట్టింట వీడియో వైరల్!

April 30, 2024

హీరోయిన్ రష్మికలో ఈ టాలెంట్ కూడా ఉందా.. నెట్టింట వీడియో వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు హిందీ తమిళ భాషల్లో వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక మందన. ఇకపోతే రష్మిక చివరగా యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.. అంతేకాకుండా ఆమె నటన పై అభిమానులు ప్రశంసలు కూడా కురిపించారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ తో శ్రీవల్లిగా నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. కాగా ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాతో పాటు గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా కుబేర సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయ్యింది రష్మిక. ఒక వైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రష్మిక.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. అయితే నటన పరంగానే కాకుండా రష్మికలో మరో టాలెంట్ ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో నేషనల్ క్రష్ ఆమ్లెట్ వేస్తూ కనిపించింది.

ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని వివరిస్తానని చెబుతూ వీడియోను ప్రారంభించింది. నువ్వుల నూనె, నెయ్యి, బచ్చలి కూర, పుట్టగొడుగులు టెరియాకి సాస్ వంటి సాధారణ పదార్థాలను ఉపయోగించి ఆమ్లెట్ వేసింది. ఆమ్లేట్ ఎలా వేయాలో చెబుతూ వీడియోను షేర్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన అభిమానులు రష్మికపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. రష్మిక లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: మహేష్ బాబుని కలుసుకున్న శ్యామలా దేవి.. నెట్టింట ఫోటోస్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు