దర్శకుడు కృష్ణవంశీకి అంత సీన్‌ ఉందా?

July 3, 2022

దర్శకుడు కృష్ణవంశీకి అంత సీన్‌ ఉందా?

1990 కాలంలో ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడతా’, అంతఃపురం, సముద్రం, మురారి ,ఖడ్గం, మహాత్మ.. వంటి హిట్‌ సినిమాలను తీశారు దర్శకుడు కృష్ణవంశీ. కానీ 2002లో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా తర్వాత ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు పది సంవత్సరాల వరకు మరో హిట్‌ అన్న మాట లేదు. ఇప్పుడు రంగమార్తండ అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. మరాఠిలో మంచి హిట్‌ సాధించిన నానాపటేకర్‌ ‘నటసామ్రాట్‌’కు ఇది తెలుగు రీమేక్‌ అన్నమాట. తెలుగులో ప్రకాశ్‌రాజ్‌ నటించారు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుంది. ఆగస్టు రెండోవారంలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఫుడ్‌ మాఫియాపై ‘అన్నం’ అనే సినిమా తీయనున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ కృష్ణవంశీకి ఓ భారీ ఓటీటీ ప్రాజెక్ట్‌ చేయాలని ఉందట. ఇదీ ఒకే. కానీ ఈ ఓటీటీ ప్రాజెక్ట్‌ ఖర్చు 300 కోట్ల అట. గతంలో ఎంత పెద్ద డైరెక్టర్‌ అయినాసరే హిట్‌ ఉంటేనే వారితో మాట్లాడే ఇండస్ట్రీ ఇది. అలాంటిది ఫ్లాప్‌ మోడ్‌లో ఉన్న కృష్ణవంశీ ఓటీటీ ప్రాజెక్ట్‌పై అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి సంస్థలు కానీ, బడా నిర్మాతలు కానీ వందల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తారా? నిజంగా 300 కోట్లు ఖర్చుపెట్టించి, తిరిగి రాబట్టగలిగే ప్రాజెక్ట్‌ చేయగలంత సీన్‌ కృష్ణవంశీకి ఉందా? అనేది డౌట్‌. అన్నట్లు.. కృష్ణవంశీకి ‘వందేమాతరం’ అనే డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది. ఇది ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తెలియదు. బహుశా..ఈ 300 కోట్ల ప్రాజెక్ట్‌ కూడ అంతేనెమో మరి..

ట్రెండింగ్ వార్తలు