పెళ్లి పీటలు ఎక్కబోతున్న చిట్టి.. వరుడు ఎవరంటే?

March 14, 2024

పెళ్లి పీటలు ఎక్కబోతున్న చిట్టి.. వరుడు ఎవరంటే?

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అయ్యారు ఇటీవల కిరణ్ అబ్బవరం నటి రహస్యల నిశ్చితార్థపు వేడుకలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి అయితే త్వరలోనే మరొక హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది.

మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి పీట లేక్కబోయే హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే జాతి రత్నాలు సినిమా ద్వారా చిట్టి పాత్రలో అందరిని మెప్పించారు నటీ ఫరియా అబ్దుల్లా. ఈమె జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా తర్వాత ఈమె హీరోయిన్గా మరి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఈమె ప్రయత్నం చేస్తే మంచి అవకాశాలే వస్తాయి కానీ పెద్దగా ఈమెకే ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది కానీ ఈమె డాన్స్ కి మాత్రం సోషల్ మీడియాలోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఈమె బెల్లీ డాన్స్ చేస్తే కల్లా అర్పకుండా చూసే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎంతో మంచి సక్సెస్ ఉన్నటువంటి ఈమె ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఈమె పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు ఆమె చిన్ననాటి స్నేహితుడేనని తెలుస్తుంది. ఇక తను షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా నటిస్తూ ఉంటారని తెలుస్తోంది. మరి చిట్టి పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ విషయం గురించి స్వయంగా చిట్టి స్పందించాల్సి ఉంది.

Read More: ఈ స్టూడెంట్స్ కి వేసవి సెలవులు లేవు.. ఎవరా స్టూడెంట్స్, ఏంటా కదా?

Related News

ట్రెండింగ్ వార్తలు