July 3, 2022
హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్‌లో 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సుబ్రహ్మాణ్యపురం’. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో సాగే రహస్యాలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్ టాక్‌ని మూటగట్టుకుంది. ఆ తర్వాత దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన లక్ష్య సినిమా కూడా బిలో యావరేజ్‌గానే మిగిలింది. అయితే ఇప్పట్లో అవకాశాలు రావనుకున్న దర్శకుడికి సుమంత్ మరో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా రెడీ అవుతుండటం విశేషం.
కేఆర్ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా పురాతన దేవాలయాల నేపథ్యంలో ఉండనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తామని చిత్రబృందం చెబుతోంది. మరి చూడాలి ఈసారైనా దర్శకుడిపై సుమంత్ పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందో లేదో..