గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

May 6, 2024

గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

సినీనటి అంజలి ప్రధాన పాత్రలో 2014వ సంవత్సరంలో నటించినటువంటి చిత్రం గీతాంజలి ఈ సినిమాలో ఈమె ద్విపాత్రభినయంలో నటించారు. గీతాంజలి సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించగా శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్, అలీ, సత్య, రాహుల్ మహాదేవ్, సునీల్, రవిశంకర్, రవికృష్ణ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. గీతాంజలి సినిమా ఎంతోమంది సక్సెస్ కావడంతో సుమారు 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీ థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా థియేటర్లలో సక్సెస్ అయినటువంటి ఈ సినిమా తిరిగి ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి తాజాగా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.

గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఆహా ఓటీటీలో మే 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. థియేటర్స్ లో ఈ సినిమా మిస్ అయినవాళ్లు ఉంటే ఆహాలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమా హారర్ తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా నటి అంజలికి 50వ సినిమా కావటం విశేషం. ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ కు జోడిగా నటించారు.

Read More: డబుల్ ఇస్మార్ట్ కీలక లెన్తీ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

Related News

ట్రెండింగ్ వార్తలు