Happy Birthday Movie Review : లావ‌ణ్య త్రిపాఠికి ఈ సారైనా హిట్ ద‌క్కిందా?

July 8, 2022

Happy Birthday Movie Review : లావ‌ణ్య త్రిపాఠికి ఈ సారైనా హిట్ ద‌క్కిందా?

రివ్యూ : హ్యాపీ బర్త్ డే (Happy Birthday ) నటీనటులు : లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ తదితరులు.. ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం సంగీతం: కాల బైరవ నిర్మాతలు : మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ రచన, దర్శకత్వం: రితేష్ రానా విడుదల తేది : 8/7/2022

మత్తు వదలరా సినిమాతో ఓ మోస్తారు హిట్ సాధించిన ద‌ర్శ‌కుడు రితేష్ రానా.. దర్శకత్వంలో నుంచి వచ్చిన రెండో చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, సత్య ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఎప్ప‌టినుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న లావ‌ణ్య త్రిపాఠికి ఈ సినిమాతోనైనా హిట్ దొరికిందా లేదా ఇప్పుడు చూద్దాం.

కథ : కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రిత్విక్ సోది ( వెన్నెల కిషోర్) దేశ పార్లమెంట్‌లో గన్ లా ను పాస్ చేస్తాడు. ఈ నేపథ్యంలో దేశంలో గన్స్ ఎక్కడపడితే.. అక్కడ అంగట్లో ప్రజలు కొనుక్కోనులా చేస్తారు. ఈ నేపథ్యంలో దేశంలో గన్ కల్చర్ రావడంలో కేంద్ర రక్షణ మంత్రి ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే పరిణామాలేంటి ? ఇక హీరోయిన్ హ్యాపీ (లావణ్య త్రిపాఠి)కి రక్షణ మంత్రికి ఉన్న సంబంధం ఏమిటన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ దర్శకుడు రితేష్ రానా.. తన తొలి చిత్రం ‘మత్తు వదలరా’ సినిమాను క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించి టాలెండ్ డైరెక్టర్‌గా మంచి మార్కులే కొట్టేసాడు. ఇపుడు హ్యాపి బర్త్ డే సినిమాను కూడా పెద్దగా కథ లేకపోయినా.. హాలీవుడ్ స్టైల్ డార్క్ కామెడీ కమ్ స్క్రీన్ ప్లే‌తో స‌ర్రియ‌ల్ కామెడి అనే కొత్త ప‌దం వాడి ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ఒక్కో పాత్రకు మరొక పాత్రకు లింక్ చేస్తూ లాస్ట్ అన్ని క్యారెక్టర్స్ ఒక క్లబ్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.. ఫస్టాఫ్‌లో సత్య చేసే కామెడీ.. విత్ అవౌట్ గేర్ కారు నడపడం ఎలా అంటూ యూట్యూబ్ వీడియో ఎపిసోడ్ సినిమా మొత్తంలో హైలెట్ అని చెప్పాలి. మొత్తంగా రితేష్ రానా… రెండో సినిమా కోసం కొత్త కథ, కథనంతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎడిటర్ ఈ సినిమాకు ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక ఫోటోగ్రఫీ రిచ్‌గా బాగుంది. సినిమాకు కాల బైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించలేలా ఉన్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు హీరోయిన్‌గా సాప్ట్ రోల్స్ చేస్తూ వచ్చింది. ఈ సినిమాలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా అనిపించింది. ఇక సత్య ఈ సినిమాలో మాక్స్ పెయిన్ పాత్రలో సినిమాను తన భుజాలపై మోసాడనే చెప్పాలి. ఒక రకంగా ఈ సినిమాకు సత్యనే హీరో అని చెప్పాలి. మరోవైపు యూనియన్ మినిష్టర్‌గా వెన్నెల కిషోర్ తనదైన శైలిలో మెప్పించాడు. ఇక నరేష్ అగస్త్య రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన సేనాపతిలో నటించారు. ఇపుడు ఈ సినిమాలో పర్వాలేదనపించాడు. రాహుల్ రామకృష్ణ, రాకెట్ రాఘవ, గెటప్ శ్రీను ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేసారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మొత్తంగా డార్క్ కామెడీ థ్రిల్లర్ నేపత్యంలో

ప్లస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే

సత్య, వెన్నెల కిషోర్ కామెడీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

కథ

నేటివిటి మిస్ కావడం

నిడివి

ఔట్ డేటెడ్ కామెడీ ట్రాక్‌

చివరి మాట : హ్యాపీ బర్త్ డే…వ‌దిలేస్తేబెట‌ర్‌

రేటింగ్ : 1.5/5

ట్రెండింగ్ వార్తలు