April 27, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అటువంటి వారిలో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలో నిర్మాతగా స్థిరపడినటువంటి అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అరవింద్ తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేశారు.
ఇప్పటికే అల్లు అరవింద్ గ్యారేజ్ లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలా కోట్లు విలువ చేసే విలాసవంతమైనటువంటి కార్లు ఉన్నప్పటికీ ఈయన తాజాగా మరొక కారుని కొనుగోలు చేశారు. అల్లు అరవింద్ తాజాగా బీఎండబ్ల్యూ ఐ 7 బ్రాండ్ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. చూడటానికి ఎంతో స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి ఈ కారు అత్యధిక సౌకర్యాలతో ఉందని చెప్పాలి.
ఇలా అన్ని సౌకర్యాలతో ఎంతో విలాస వంతంగా ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ కారు సుమారు రెండున్నర కోట్ల విలువ చేస్తుందని సమాచారం. ఇక ఇప్పటికే అల్లు అరవింద్ గ్యారేజీలో కొన్ని కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. తాజాగా వాటి జాబితాలోకి ఈ ఎలక్ట్రిక్ బీఎండబ్ల్యూ కారు వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. హీరోగా అల్లు అర్జున్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
Read More: కూటమికి మద్దతుగా హీరో నిఖిల్.. టిడిపి ప్రచారంలో బిజీ బిజీ!