April 27, 2024
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఆంధ్రాలో లోక్ సభ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఏపీలో ఇటీవల నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ క్రమంలోనే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమాలలో బిజీ అవుతున్నారు.
ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల చీరాల నియోజకవర్గం నుంచి మాలకొండయ్య యాదవ్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉన్నటువంటి కొండయ్య ఎంతో ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని ఈయన నామినేషన్ వేశారు .అయితే ఈ ర్యాలీలో భాగంగా సినీ నటుడు నిఖిల్ కూడా పాల్గొన్నారు.
ఇలా ర్యాలీలో పాల్గొన్నటువంటి ఈయన అనంతరం మాట్లాడుతూ చీరాల చిరునవ్వులు చిందించాలి అంటే కొండయ్య గారు గెలవాలని మీ అమూల్యమైన ఓటు ఈయనకు వేసి గెలిపించాలని కోరారు అలాగే కూటమి గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా నిఖిల్ ఈ పర్యటనలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.
ఇక నిఖిల్ రాజకీయ పార్టీల తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదని తెలుస్తుంది మాలకొండయ్య పెద్ద కుమారుడు అమర్నాథ్ స్వయంగా నిఖిల్ సోదరి భర్త కావడంతోనే ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలుస్తుంది. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే నిఖిల్ టిడిపి ప్రచార కార్యక్రమాలను చేశారని తెలుస్తుంది.
Read More: పెళ్లి డ్రెస్సుతో ప్రయోగం చేసిన సమంత.. జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయిగా?