Kanguva Shooting: హీరో సూర్యకు త‌ప్పిన భారీ ప్రమాదం..

November 23, 2023

Kanguva Shooting: హీరో సూర్యకు త‌ప్పిన భారీ ప్రమాదం..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది(Hero Surya Injured). ఆయ‌న హీరోగా న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తున్న కంగువ చిత్రం షూటింగ్‌ ఫైనల్‌షెడ్యూల్‌ జరుగుతుంది. ఒక భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ షూట్ చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో షూటింగ్‌ ముగించుకుని వచ్చిన కంగువ టీమ్‌.. తాజాగా ఫైనల్ షెడ్యూల్‌ చిత్రీకరణనను చెన్నైలో ప్లాన్‌ చేశారు.

కంగువ చిత్రం కోసం భారీ యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్‌ కెమెరా వచ్చి పడంది. దీంతో ఆయన భుజానికి గాయమైంది. వెంటనే షూటింగ్‌ ఆపేసిన యూనిట్‌ సభ్యులు..సూర్యను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాక‌పోతే కొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాల్సి ఉంటుంది.

అదృష్టవశాత్తూ ఆ కెమెరా సూర్య భుజానికి తగలడంతో భారీ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారని చిత్ర యూనిట్ తెలిపింది. లేదంటే ఆ కెమెరా భుజానికి బదులుగా సూర్య తలపై పడింటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని అక్కడి వారు చెబుతున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నారు. .

ఈ క్రమంలో తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు సూర్య(Hero Surya Injured). అలాగే ప్రమాదం ఎలా జరిగిందని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “ప్రియమైన మిత్రులారా.. శ్రోయోభిలాషులు.. నా అభిమానులు. మీరు నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ నేను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆరోగ్యం కొంచెం స్థిమితంగా ఉంది. మీ అందరి ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు. సూర్య తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కంగువ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 38 భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

Read MoreNaga Chaitanya: ఈ బ‌ర్త్ డే నాకు స‌మ్‌థింగ్ స్పెష‌ల్ – నాగ‌చైత‌న్య‌

Related News

ట్రెండింగ్ వార్తలు