ఆ స్వార్ధంతోనే ముందు ఓ బేబి చేశాను – తేజ సజ్జ
November 18, 2021
బాలనటుడిగా పరిచయమైనప్పటికీ ‘ఓ బేబి’, ‘జాంబిరెడ్డి’, `ఇష్క్` వంటి చిత్రాల ద్వారా హీరోగా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తేజ సజ్జ. ఆయన హీరోగా రామ్‌మల్లిక్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అద్భుతం’. శివాని రాజశేఖర్ హీరోయిన్. ఈ నెల 19న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జ మీడియాతో ముచ్చటించారు.ఒక యూనివర్సల్ ప్రాబ్లమ్ వలన ఇద్దరికి ఒకే ఫోన్ నెంబరు రావడం అదే వాళ్ల పరిచయానికి కారణం అవుతుంది. సాదారణంగా అలా జరుగదు కాని ఎందుకు అలా జరిగింది అనే అంశం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను దర్శకుడు రామ్ మల్లిక్ గారు నిజంగానే ‘అద్భుతం’గా డీల్ చేశారు. ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్ కథ. ‘ఓ బేబీ’ సినిమా కన్నా ముందు ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం. ఇక షూట్‌కు వెళ్లిపోదాం అనుకుంటుండగా ‘ఓ బేబీ’ అవకాశం వచ్చింది నాకు. ఆ సినిమా ద్వారా ఎక్కువమంది ఆడియెన్స్‌కు రీచ్ అయ్యే అవకాశం ఉండటంతో అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే స్వార్ధంతో ముందుగా ‘ఓ బేబీ’ చేశాను అని చెప్పుకొచ్చాడు తేజ సజ్జ