ధృవ్ విక్రమ్ తో సినిమా చేయబోతున్న అనుపమ.. టైటిల్ అనౌన్స్?

May 6, 2024

ధృవ్ విక్రమ్ తో సినిమా చేయబోతున్న అనుపమ.. టైటిల్ అనౌన్స్?

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుపమ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న అనుపమ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. అలాగే అనుపమ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని భాషల్లో సినిమాలు అనౌన్స్ చేస్తోంది. ఇటీవలే పరదా అనే ఓ సినిమా అనౌన్స్ చేసింది. తాజాగా మరో సినిమాని ప్రకటించింది అనుపమ. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ సరసన అనుపమ సినిమా చేయబోతుంది.

తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్ పై ధృవ్ విక్రమ్ అనుపమ జంటగా నటించబోతున్నారు. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు బైసన్ అనే టైటిల్ ప్రకటించారు. కాలమాదన్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం తమిళంలో మాత్రమే తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులోకి ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరీ.

కాగా ఇటీవల అనుపమ టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల కాకముందే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు చూసిన నెటిజన్స్ అనుపమను భారీగా విమర్శించారు. కానీ సినిమా విడుదల తర్వాత ఎవరైతే ఆమెను తిట్టారో వారందరూ కూడా మెచ్చుకున్నారు.

Read More: ప్రభాస్ ని హిజ్రాగా మార్చిన డైరెక్టర్.. సిగ్గుతో అవమానంగా ఫీలైన డార్లింగ్?

ట్రెండింగ్ వార్తలు