May 6, 2024
తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనుష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కుబేర అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే తిరుపతిలో కుబేర మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఇప్పటికే విడుదల చేసిన ధనుష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం ధనుష్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక సన్నివేశం కోసం ధనుష్ ఒక డంపింగ్ యార్డ్ లో పది గంటలు గడిపారట. కుబేర సినిమా కోసం డంపింగ్ యార్డ్ లో చెత్త పక్కన పదిగంటలు గడిపారట.
అది కూడా మాస్క్ లేకుండా ఉన్నారట. తన క్యారెక్టర్ లో ఎంత పెయిన్ ఉంటుందో చూపించాలని ధనుష్ ఇంత కష్టపడ్డారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది కదా డెడికేషన్ అంటే అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.
Read More: చెర్రీ, తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా!