ప్రభాస్ ని హిజ్రాగా మార్చిన డైరెక్టర్.. సిగ్గుతో అవమానంగా ఫీలైన డార్లింగ్?

May 6, 2024

ప్రభాస్ ని హిజ్రాగా మార్చిన డైరెక్టర్.. సిగ్గుతో అవమానంగా ఫీలైన డార్లింగ్?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. కాగా ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరోల్లో ఒకరు. సినిమాకు రూ. 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ప్రభాస్ తో సినిమా అంటే రూ. 500 కోట్ల బడ్జెట్ కావాల్సిందే.

ఆయన ప్లాప్ సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. బాహుబలి చిత్రాలు ఆయన రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. పాన్ ఇండియా స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. అయితే ప్రభాస్ కెరీర్లో అనేక రకాల పాత్రలు, జోనర్స్ ట్రై చేశారు. మాస్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ లవ్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా చేశారు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు ఆయనకు అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. మహేష్ తర్వాత ప్రభాస్ కి ఆ ఇమేజ్ వచ్చింది.

కెరీర్ బిగినింగ్ లో చేసిన చిత్రాల్లో చక్రం ఒకటి. డైరెక్టర్ కృష్ణ వంశీ చక్రం చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్ కి జంటగా అసిన్, ఛార్మి నటించారు. ప్రకాష్ రాజ్ ఇందులో కీలక రోల్ చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా చక్రం మూవీలో ఒక సన్నివేశంలో ప్రభాస్ హిజ్రా గా నటిస్తాడు. ఆ సీన్ చేయలేక ప్రభాస్ సిగ్గుతో చాలా ఇబ్బంది పడ్డాడట. ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న ఛార్మి తండ్రి చంద్రమోహన్ మొదటి భార్య వద్దకు వచ్చి డబ్బులు ఇస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ఛార్మి తండ్రి చంద్రమోహన్ మీద ఫైర్ అవుతుంది. ఇంట్లో నుండి రోడ్డు మీదకు లాక్కొచ్చి దారుణంగా తిడుతుంది. ఈ వివాదాన్ని ఆపేందుకు ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఛార్మి కోపాన్ని తగ్గించి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభాస్ అందరి ముందు హిజ్రా గా నటిస్తాడు. నిజానికి అలా నటించడం ప్రభాస్ కి ఇష్టం లేదట. కానీ కృష్ణవంశీ చాలా స్ట్రిక్ట్. ఆయనకు ఎదురు చెప్పలేక ప్రభాస్ నటించాడట. కాగా ఆ షాట్ ఓకే అయ్యేవరకు ప్రభాస్ లోలోపల సిగ్గుతో సచ్చిపోయాడట. అంతేకాకుండా చాలా అవమానంగా కూడా ఫీలయ్యారట.

Read More: బాలయ్య చిన్నల్లుడు పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు