ఆ ఐటెం సాంగ్ ను మిస్ అయ్యాను.. యాంకర్ శ్రీముఖి కామెంట్స్ వైరల్?

May 6, 2024

ఆ ఐటెం సాంగ్ ను మిస్ అయ్యాను.. యాంకర్ శ్రీముఖి కామెంట్స్ వైరల్?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ ఫిమేల్ యాంకర్స్ లో యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు. తెలుగులో ఎన్నో షోలకు, ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. కాగా ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. అభిమానులు ఈమెను ప్రేమగా రాములమ్మ అని పిలుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం శ్రీముఖి ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది శ్రీముఖి. ఇది ఇలా ఉంటే తాజాగా సంబంధించిన ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే. తెలుగు రాష్ట్రాల్లో యువతని ఉర్రూతలూగించిన ఒక ఐటెం సాంగ్ లో శ్రీముఖికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందట. ఇదే విషయాన్ని యాంకర్ శ్రీముఖి స్వయంగా చెప్పు కొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీముఖిని యాంకర్ ప్రశ్నిస్తూ.. ఎవరైనా డైరెక్టర్ ఐటెం సాంగ్స్ కోసం అప్రోచ్ అయ్యారా అని అడగగా.. నాకు ఎక్స్ ఫోజింగ్ అతిగా చేయడం ఇష్టం ఉండదు. అవసరమైన మేరకు ఒకే. అందుకే నేను స్పెషల్ సాంగ్స్ కి దూరంగా ఉండేదాన్ని.

డైరెక్టర్స్ కూడా నన్ను నేరుగా సంప్రదించలేదు. అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ మాత్రం మిస్ అయ్యాను. రవితేజ క్రాక్ చిత్రంలో భూమ్ బద్దలు సాంగ్ నేను చేయాల్సింది అని శ్రీముఖి తెలిపింది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక ఈవెంట్ లో నేను పెర్ఫామ్ చేశాను. అప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని నా దగ్గరకి వచ్చి ఫస్ట్ నేను ఈ సాంగ్ నీ తోనే చేయించాలని అనుకున్నాను అని తెలిపారు అని చెప్పుకొచ్చింది శ్రీముఖి. కానీ ఆ అమ్మాయి అంత ఎక్స్ ఫోజింగ్ చేయదు సర్ అని నాతో చాలా మంది అన్నారు. అందుకే అడగలేదు. అయ్యో సర్ నన్ను అడిగి ఉండాల్సింది. నేను తప్పకుండా ఒప్పుకునేదాన్ని. నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అనినేను చెప్పాను. సరేలే భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను అని అన్నారు అని తెలిపింది శ్రీముఖి.

Read More: ధృవ్ విక్రమ్ తో సినిమా చేయబోతున్న అనుపమ.. టైటిల్ అనౌన్స్?

ట్రెండింగ్ వార్తలు