బాలయ్య చిన్నల్లుడు పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్!

May 6, 2024

బాలయ్య చిన్నల్లుడు పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి నటి పూనమ్ కౌర్ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. గత కొద్ది రోజుల వరకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఈమె పరోక్షంగా చేసే పోస్టులు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇకపోతే తాజాగా ఈమె హీరో బాలయ్య చిన్నల్లుడు భరత్ గురించి చేస్తున్నటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈమె గీతం అధినేత భరత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక ఈయన కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భరత్ 2019 ఎన్నికలలో వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఓడిపోయారు. అయితే ఈసారి ఎలాగైనా గెలుపొందాలి అనేది దిశగానే భరత్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈసారి ఈయన గెలుపు కూడా ఖాయమని తెలుస్తుంది. అయితే తాజాగా భరత్ రాజకీయాల గురించి పూనమ్ స్పందిస్తూ..ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో చూస్తుంటే ఈ ఎన్నికల్లో శ్రీ భరత్ ఏదో సాధించేలా కనిపిస్తున్నాడని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. వైజాగ్ నుంచి శ్రీభరత్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కు వెళ్తే అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు.

చదువు గురించి భవిష్యత్తు గురించి అవగాహన ఉన్నటువంటి భరత్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకూడదు అంటూ ఈమె ఊహించని విధంగా ఆయన గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. గత కొద్దిరోజులుగా పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి ఈమె ఇలా ఉన్న ఫలంగా బాలయ్య చిన్న అల్లుడు గెలుపు గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Read More: మాస్క్ కూడా లేకుండా చెత్త కుప్పలో పదిగంటలు ఉన్న ధనుష్.. ఇది కదా డెడికేషన్ అంటే అంటూ?

ట్రెండింగ్ వార్తలు